వివాహ వేదికగా మారిన జయ సమాధి

Thu,September 12, 2019 01:06 PM

Jayalalithaa resting place turns wedding venue for AIADMK leader son

చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సమాధి.. వివాహ వేదికగా మారింది. జయలలిత ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలనే ఆకాంక్షతో ఆమె సమాధి వద్ద వివాహం చేసుకున్నారు. అన్నాడీఎంకే నాయకుడు ఎస్ భవానీశంకర్ కుమారుడు సతీష్‌కు ఆర్ దీపికతో బుధవారం వివాహం జరిగింది. అయితే అమ్మ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో.. జయ సమాధి వద్ద సంప్రదాయబద్ధంగా సతీష్, దీపిక వివాహం ఘనంగా జరిపించారు.

మెరీనా బీచ్ లోని జయ సమాధిని రంగురంగుల పూలతో అలంకరించారు. సమాధి ముందే.. వేద మంత్రాలతో.. పంచభూతాల సాక్షిగా సతీష్, దీపిక ఒక్కటయ్యారు. ఇక సమాధి ముందు పార్టీ గుర్తు అయిన ఆకుపచ్చ రంగులో ఉన్న రెండు ఆకులను ఏర్పాటు చేసి అమ్మకు నివాళులర్పించారు నూతన దంపతులు. జయలలిత 2016, డిసెంబర్ 5వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.

1581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles