శివ‌కుమార్ అరెస్టు

Wed,July 10, 2019 02:46 PM

Karnataka Minister DK Shivakumar detained today at Mumbai hotel

హైద‌రాబాద్‌: ముంబైలోని రియ‌న‌సెన్స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ హోట‌ల్ ముందు ధ‌ర్నా చేస్తున్న క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హోట‌ల్ వ‌ద్ద 144వ సెక్ష‌న్‌ను విధించిన విష‌యం తెలిసిందే. హోట‌ల్‌లో బ‌స చేస్తున్న క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను క‌లిసేందుకు శివ‌కుమార్ అక్క‌డ‌కు వెళ్లారు. కానీ హోట‌ల్ లోప‌లికి వెళ్లేందుకు ఆయ‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో ముంబైలో క‌ర్నాట‌కం కొన‌సాగుతూనే ఉన్న‌ది. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మికి చెందిన ప‌ది మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఆ హోట‌ల్‌లో బ‌స చేస్తున్న విష‌యం తెలిసిందే. శివ‌కుమార్‌ను క‌లిసేందుకు వ‌చ్చిన కాంగ్రెస్ నేత‌లు మిలండ్ డియోరా, సంజ‌య్ నిరుప‌మాల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రోవైపు క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలాను బీజేపీ నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప ఇవాళ క‌లిశారు. ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకునేలా స్పీక‌ర్‌పై వత్తిడి తేవాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరిన‌ట్లు య‌డ్డీ చెప్పారు. సీఎంగా కొన‌సాగేందుకు కుమార‌స్వామికి నైతిక హ‌క్కు లేద‌న్నారు. వాళ్లకు సంఖ్యా బ‌లం లేద‌న్నారు. బీజేపీ వ‌ద్ద సంఖ్యా బ‌లం ఉంద‌ని, స్పీక‌ర్ కావాల‌నే ఆల‌స్యం చేస్తున్నార‌ని య‌డ్డీ అన్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో క‌ర్నాట‌క‌లోని కుమార‌స్వామి ప్ర‌భుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయిన విష‌యం తెలిసిందే.

1411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles