రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ నోటీసులు

Mon,July 22, 2019 11:11 AM

Karnataka Speaker Ramesh Kumar issues notice to rebel MLAs

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క రాజ‌కీయ డ్రామా ఇవాళ కొత్త మ‌లుపు తిరిగింది. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ నోటీసులు ఇచ్చారు. జూలై 23వ తేదీ 11 గంట‌ల్లోగా త‌న ముందుకు రావాలంటూ స్పీక‌ర్ త‌న నోటీసులో కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటును వేయాల‌ని కూట‌మి నేత‌లు కోరారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చారు. ఇందులో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వంత పార్టీల‌కు గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యేల‌పై ప‌ద‌వ షెడ్యూల్ ప్ర‌కారం వేటు వేయాల‌ని ఆయా పార్టీలు కోరుతున్నాయి. మ‌రోవైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇవాళే అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం తోసిపుచ్చింది. బీఎస్పీ ఎమ్మెల్యే మ‌హేశ్‌.. బ‌ల‌ప‌రీక్ష తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సీఎం కుమార‌స్వామికి అనుకూలంగా ఓటు వేస్తార‌ని ఆ పార్టీ నేత మాయావ‌తి త‌న ట్విట్ట‌ర్‌లో స్ప‌ష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంట‌ల లోపు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్పీక‌ర్ తెలిపారు.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles