ఉగ్ర‌వాదుల‌కు క‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హా..

Mon,July 22, 2019 11:39 AM

Kashmir Governor Satya Pal Singh asks terrorists to kill corrupt politicians

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న అవినీతి రాజ‌కీయ నాయ‌కుల‌ను ఉగ్ర‌వాదులు కాల్చి చంపాల‌ని ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తూ ఆయ‌న తెలిపారు. అమాయ‌కులైన పౌరులు, పోలీసులను చంప‌డం ఆపేయాల‌న్నారు. గ‌న్నుల‌ను పట్టిన స్థానిక క‌శ్మీరీలు ఎందుకు స్వంత ప్ర‌జ‌ల‌ను చంపుతున్నారని, క‌శ్మీర్ సంప‌ద‌ను దోచిన‌వారిని చంపండంటూ కార్గిల్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ అన్నారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌పై ఇవాళ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి విప‌రీతంగా ఉంద‌ని, అందుకే ఆవేశంలో అలా మాట్లాడాల్సి వ‌చ్చింద‌న్నారు. ఒక గ‌వ‌ర్న‌ర్ హోదాలో నేను అలా మాట్లాడ‌కూడ‌దు, కానీ వ్య‌క్తిగ‌తంగా నా అభిప్రాయాలు అవే అంటూ స‌త్య‌పాల్ తెలిపారు. అయితే గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశిస్తూ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా ఆదివారం ఓ వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా కాల్చివేత‌కు గురైతే.. అది గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు జ‌రిగిన‌ట్లు గుర్తించాల‌ని ఒమ‌ర్ ఆ ట్వీట్‌లో తెలిపారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles