భార‌త్‌లో క‌శ్మీర్ అంత‌ర్భాగ‌మే: జ‌మాత్ ఉలేమా

Thu,September 12, 2019 02:52 PM

Kashmir is an integral part of India, says Jamiat Ulema-e-Hind chief Mahmood Madani

హైద‌రాబాద్: క‌శ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని.. భార‌త ఇస్లామిక్ సంస్థ జ‌మాత్ ఉలేమా హి హింద్ స్వాగ‌తించింది. భార‌త్‌లో క‌శ్మీర్ అంత‌ర్భాగ‌మ‌ని జ‌మాత్ ఉలేమా చీఫ్ మెహ‌మూద్ మ‌దానీ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముస్లింలు భార‌త్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న వాదాన్ని పాకిస్థాన్ అంత‌ర్జాతీయంగా వినిపించాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. పాక్ చ‌ర్య‌ల‌ను తాము ఖండిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. భార‌త్‌లో క‌శ్మీర్ అంత‌ర్భాగ‌మ‌న్న తీర్మానాన్ని ఆమోదించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దేశ భ‌ద్ర‌త‌, స‌మ‌గ్ర‌త అంశంలో రాజీప‌డేదిలేద‌న్నారు. మేం భార‌తీయుల‌మే, దానికి మేం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌మాత్ ఉలేమా చీఫ్ తెలిపారు. భార‌త్‌లో పూర్తిగా క‌శ్మీర్ క‌ల‌వ‌డం వ‌ల్లే అక్క‌డ సంక్షేమం వెల్లువిరుస్తుంద‌ని అన్నారు. వార్షిక స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

2100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles