నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి!

Mon,February 11, 2019 03:30 PM

Keep her safe says Robert Vadra in his new post about wife Priyanka Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఈ మధ్యే ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు, తన అన్న రాహుల్‌గాంధీతో కలిసి తొలిసారి లక్నోలో ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఆసక్తి రేపుతున్నది. రాజకీయాల్లోకి వెళ్లిన తన భార్యకు శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. ఉత్తమైన భార్యవి. మన పిల్లలకు మంచి తల్లివి. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నీకు బెస్ట్ విషెస్. అయితే ప్రస్తుతం దుర్మార్గపు, విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆమెను దేశ ప్రజల చేతుల్లో పెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఫేస్‌బుక్‌లో రాబర్ట్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో అతడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే.

6667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles