వారెవ్వా.. ఏం టాలెంట్ భయ్యా... కోల్డ్ కాఫీ ఇలా కూడా చేస్తారా? వీడియో

Mon,April 15, 2019 03:48 PM

Kerala man shows off mad bartending skills at street side stall in TikTok viral video

సాధారణంగా కోల్డ్ కాఫీని తయారు చేసి ఉంటే ఈ కుర్రాడు ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయి ఉండేవాడే కాదు. అవును.. ఈ కుర్రాడు రకరకాల విన్యాసాలు చేస్తూ కోల్డ్ కాఫీని తయారు చేస్తాడు. కేరళకు చెందిన ఈ కుర్రాడు తన స్టాల్‌లో కోల్డ్ కాఫీ చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి టిక్‌టాక్ యాప్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిక్‌టాక్ యాప్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.

మామూలుగా బార్లలో ఇటువంటి విన్యాసాలు చేస్తుంటారు. వీటిని బార్ టెండింగ్ స్కిల్స్ అంటారు. అవే స్కిల్స్ ఉపయోగించి మనోడు కోల్డ్ కాఫీ చేశాడు. ఇక.. ఆ కుర్రాడు విన్యాసాలు చేస్తూ చేసే కోల్డ్ కాఫీ తాగడానికి కస్టమర్లు క్యూ కడుతున్నారట. చూశారుగా.. అందరిలో ఒకరిలా కాదు.. అందరిలో వెరైటీగా ఉంటేనే మనకు గుర్తింపు.2098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles