వరుస బాంబు దాడులు దారుణం: ట్విట్టర్ లో కేటీఆర్

Sun,April 21, 2019 07:12 PM

KTR Condemns Srilanka Terror attack


కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. కొలంబోలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన పేలుళ్లు చాలా దారుణమైనవని కేటీఆర్ పేర్కొన్నారు. పవిత్ర పర్వదినం ఈస్టర్‌ సందర్భంగా దుండగులు విలువైన ప్రాణాలను బలితీసుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి సమయంలో శ్రీలంక వాసులు ధైర్యంగా ఉండాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles