విక్ర‌మ్ ల్యాండింగ్ : సెప్టెంబ‌ర్ 7, తెల్ల‌వారుజామున 1.55 నిమిషాల‌కు

Tue,August 20, 2019 12:19 PM

Lander Vikram will soft land on Moon on September 7, informs ISRO Chief Sivan

హైద‌రాబాద్‌: ఇస్రో చైర్మ‌న్ కే.శివ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్ర‌యాన్‌2ను విజ‌య‌వంతంగా లూనార్ ఆర్బిట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సెప్టెంబ‌ర్ 2వ తేదీన చంద్ర‌యాన్‌2కు సంబంధించి మ‌రో కీల‌క ఘ‌ట్టం ఉంటుంద‌న్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 3వ తేదీన సుమారు మూడు సెక‌న్ల పాటు ఓ చిన్న‌పాటి ప్ర‌క్రియ ఉంటుంద‌ని శివ‌న్ చెప్పారు. ఆ ప్ర‌క్రియ‌తో ల్యాండ‌ర్ ప‌నితీరు తెలుస్తుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌, తెల్ల‌వారుజామున‌ 1.55 నిమిషాల‌కు చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంద‌ని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు. త‌మ వంద మాన‌వ ప్ర‌య‌త్నం అంతా చేసిన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ల‌క్ష్యానికి మ‌రింత చేరువైన‌ట్లు ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పింది.

1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles