చిరుత, ముళ్లపంది మధ్య పోరాటం.. గెలిచిందెవరు?.. వీడియో

Thu,November 21, 2019 12:08 PM

చిరుతను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే.. దాన్ని చూడగానే పరుగెత్తుతాం.. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ ముళ్లపంది ముందు చిరుత ఓడిపోయింది. కాసేపు ముళ్లపందితో పోరాటం చేసినప్పటికీ.. చివరకు తన దారిన తాను వెళ్లిపోయింది చిరుత.


ఇండియన్‌ ఫారెస్టు అధికారి ప్రవీన్‌ కశ్వాన్‌.. చిరుత, ముళ్ల పంది మధ్య జరిగిన పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించి తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశాడు. ఓ రహదారిపై రాత్రి సమయంలో చిరుత, ముళ్ల పంది ఎదురుపడ్డాయి. దీంతో ముళ్ల పందిని చంపి తినేందుకు చిరుత పులి యత్నించింది. కానీ ముళ్ల పందిపై దాడి చేసిన సమయంలో దాని బలమైన ఈకలు చిరుతకు అడ్డొచ్చాయి. చిరుత నోరుకు ఈకలు కుచ్చుకున్నాయి. దీంతో పులి కాసేపు ఇబ్బంది పడింది. ముళ్ల పంది వద్దకు వెళ్తే హానీ కలిగే ప్రమాదం ఉందని భావించిన చిరుత.. అక్కడ్నుంచి తన దారిన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


3622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles