వరద నీటిలో డ్యాన్స్..వీడియో వైరల్

Thu,August 8, 2019 05:29 PM

Locals dance on waterlogged National Highway in belagavi

క‌ర్నాట‌క‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. వరదలు పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. సాధారణంగా వరదలు వచ్చినపుడు ప్రజలు తమను ఎవరు కాపాడతారోనని భయంతో బిక్కుబిక్కుమంటూ వణికిపోవడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలోని యమనగర్నీ గ్రామవాసులు వరదలను ఎంజాయ్ చేస్తున్నారు. భారీ వర్షాలతో నిప్పని-కొల్హాపూర్ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. యమనగర్నీ గ్రామానికి చెందిన కొంతమంది ఆ వరద నీటిలో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా వరద నీటిలో మాస్ బీట్ సాంగ్స్ వేసుకుని చిందేశారు. ఈ వీడియో ఇపుడు ఆన్ లైన్ లో తెగవైరల్ అవుతోంది. వరదలు వచ్చినపుడు భయపడటమే కాదు..ఇలా ఎంజాయ్ కూడా చేయొచ్చని నిరూపించారు ఆ గ్రామస్థులు. భారత వాతావరణ శాఖ ఇప్పటికే కర్నాటకలో రెడ్ అలర్ట్ జారీచేసింది.3199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles