సౌదీలో బందీగా భారత మహిళ

Sat,December 30, 2017 05:43 PM

పంజాబ్: పంజాబ్‌లోని లూధియానాకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో బందీగా చిక్కుకుపోయింది. కుల్దీప్ కౌర్(46) అనే మహిళ ఆరు నెలల క్రితం ఇంటి పనుల సహాయకురాలిగా సౌదీ అరేబియాకు వెళ్లింది. కాగా యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని.. తిరిగి వచ్చేద్దామంటే బందిగా ఉంచాడని పేర్కొంటూ ఓ వీడియోను కూతురు సోనియాకు పంపించింది. తన తల్లి చదువుకోలేదని.. సౌదీలో ఎక్కడుందో కూడా ఆమెకు తెలియదని బాధితురాలి కూతురు పేర్కొంది. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించి తన తల్లిని వెనక్కి తీసుకురావాల్సిందిగా బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

2754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles