క‌లైంజ్ఞ‌ర్‌ మృతి పట్ల సీఎస్కే, రైనా సంతాపం

Wed,August 8, 2018 01:57 PM

M Karunanidhi demise How Chennai Super Kings, Suresh Raina paid condolences

చెన్నై: 11 రోజులుగా మృత్యువుతో పోరాడిన 94ఏండ్ల తమిళ దిగ్గజం, డీఎంకే అధినేత కరుణానిధి చికిత్స పొందుతూ కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కరుణ మృతిపట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా సంతాపం ప్రకటించారు. ద్రవిడ ఉద్యమనేత కరుణానిధి అస్తమయం. తమిళంపై ఆయనకు ఉన్న పట్టు అపారమైనదని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని సీఎస్కే తన ట్విటర్ ఖాతాలో కొనియాడింది.

సీనియర్ క్రికెటర్ రైనా కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం తెలిపాడు. కలైంజర్ కరుణానిధి మృతిపట్ల సంతాపం తెలుపుతున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.


1817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles