నళిని పెరోల్ పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ

Thu,September 12, 2019 12:11 PM

Madras High Court refuses to extend parole of Rajiv Gandhi assassination convict Nalini Sriharan

చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ పెరోల్ పొడిగింపునకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. తన బిడ్డ వివాహ నేపథ్యంలో మరో నెల రోజులు పెరోల్ పొడిగించాలని నళిని కోర్టును ఆశ్రయించింది. నళిని అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తన కుమార్తె పెండ్లి ఉన్నదని, ఈ నేపథ్యంలో ఆరు నెలల పెరోల్‌ను మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు జులై 25న 30 రోజుల పెరోల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరింత సమయం కావాలని నళిని కోరడంతో.. మళ్లీ మూడు వారాలు పెరోల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 15వ తేదీ వరకు పెరోల్ పొడిగించాలన్న నళిని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆమె పెరోల్ గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. 1991 నుంచి వేలూరులోని జైలులో నళిని శిక్ష అనుభవిస్తుంది.

662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles