ఆర్జేడీ 20.. కాంగ్రెస్‌ 9

Fri,March 22, 2019 06:41 PM

Mahagathbandhan seat sharing: RJD to contest in 20 places in Bihar, Congress 9, others 11

హైద‌రాబాద్: బీహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మ‌హాకూట‌మి సీట్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్‌(ఆర్జేడీ) 20 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ది. ఇక కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఉపేంద్ర కుశ్వా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ అయిదు స్థానాల్లో, జిత‌న్ రాం మాంజీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా, ముఖేశ్ స‌హ‌ని నేతృత్వంలోని వికాషీల్ ఇన్సాన్ పార్టీ చెరి మూడేసి సీట్ల‌లో పోటీ చేయ‌నున్న‌ది. సీపీఐ ఎంఎల్ కూడా ఒక చోట పోటీ చేస్తుంది. శ‌ర‌ద్ యాద‌వ్ ఈసారి ఎన్నిక‌ల్లో ఆర్జేడీ సింబ‌ల్‌పై పోటీ చేయ‌నున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత లోక్‌తాంత్రిక్ జ‌న‌తాదళ్‌ను ఆర్జేడీలో క‌లిపేస్తార‌ని మ‌నోజ్ జా తెలిపారు.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles