వరద నీటిలో చిక్కుకుపోయిన మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్

Sat,July 27, 2019 10:48 AM

ముంబయి: మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముంబయి-కొల్హాపూర్ మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ తెల్లవారుజామున 3 గంటలకు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైలులో మొత్తం 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబయికి 100 కిలోమీటర్ల దూరంలో వంగని-బాద్లాపూర్ మధ్యలో రైలు ఆగిపోయింది. ఆర్పీఎఫ్ సిబ్బంది, నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరును అందించారు. రైలు నుంచి దిగొద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికుల రక్షణ నిమిత్తం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

3042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles