మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌.. 220 మందిని కాపాడారు..

Sat,July 27, 2019 01:00 PM

ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైలు పట్టాలపై వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైళ్లు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ముంబై నుంచి కొల్హాపూర్‌ వెళ్తున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ను బద్లాపూర్‌ - వాగానీ మధ్య నిలిపివేశారు రైల్వే అధికారులు. ఉల్లాస్‌ నది ఉప్పొంగడంతో ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్లకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 600 మందిని కాపాడగా, ఇందులో 150 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఎనిమిది బోట్లతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.


ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు, మిలటరీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైల్లో 700 మంది ప్రయాణికులున్నట్లు సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో ట్వీట్‌ చేసింది. కానీ రైల్లో 2 వేల మంది ప్రయాణికులు ఉన్నట్లు అనధికారికంగా వార్తలు వస్తున్నాయి.


2571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles