ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ర్యాలీ

Thu,September 12, 2019 04:51 PM

కలకత్తా: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌర జాజితా)కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అస్సాంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్‌ఆర్‌సీలో 19 లక్షల మందికి జాబితాలో చోటు దక్కలేదు. వారిలో అన్ని మతాల ప్రజలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు వారిని దేశం వదిలి వెళ్లాలంటే వారి పరిస్థితి ఏంటి..! అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.


76 సంవత్సరాల స్వతంత్య్ర భారత్‌లో జాతీయతను నిరూపించుకోవాల్సి రావడం మన దౌర్భాగ్యం అని ఆమె అన్నారు. అస్సాంలో పోలీసు బలగాలతో ప్రజల్ని బెదిరించి మీరు చేసిన దౌర్జన్యం మా రాష్ట్రంలో చేయలేరు. ఇప్పటికిప్పుడు మాకు మీరు(బీజేపీ) మతాల గురించి, పండుగల గురించి తెలుపడం శోచనీయం. ఇంతకు ముందు దుర్గా పూజ, ఈద్‌, మొహర్రం, గణేష్‌ చతుర్థి లాంటి పండుగలు జరుపుకోలేమా.. అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.






527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles