దీదీ తన నీడను చూసి భయపడుతున్నారు: మోదీ

Wed,May 15, 2019 06:16 PM

mamata Scared Of Her Own Shadow says pm modi


కోల్‌కతా: ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ఫైర్ అయ్యారు. బెంగాల్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. మమతాబెనర్జీ రెండు రోజుల క్రితం జరిగిన ఘటనతో తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు బహిరంగంగా ఒప్పుకున్నారన్నారు. రోడ్ షోలో అమిత్ షాపై దాడి చేయించి 24 గంటల్లోనే దీదీ తన ఎజెండాను నెరవేర్చుకున్నారని మోదీ విమర్శించారు. దీదీ ఎన్నికలు రాగానే తన నీడను చూసి తానే భయపడుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసిన కేసులో బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్టైన నేపథ్యంలో..దీదీ ఒక్క ఫొటో కోసమే ఇంత రాద్దాంతమా..? కూతుళ్లను జైలుకు పంపిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తామని మోదీ హెచ్చరించారు. మీరు మంచి ఆర్టిస్ట్ అయితే నా ఫొటోను చిత్రించి..ఈ నెల 23 తర్వాత నాకు ప్రజెంట్ చేయండి. ఒకవేళ మీరు వేసిన బొమ్మ చెత్తగా ఉన్నా..నేను మీపైన ఎలాంటి కేసు వేయనని హామీనిస్తున్నానని దీదీకి ప్రధాని మోదీ చురుకలంటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్ షోలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే.

683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles