పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు.. వీడియో

Thu,April 18, 2019 05:59 PM

man died while dancing in marriage ceremony video goes viral

మనిషికి చావు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. చనిపోయే వ్యక్తికి కూడా తన చావు తెలియదు. ఎందుకంటే.. చావు వచ్చినప్పుడు అతడు ఉండడు. అతడు ఉన్నప్పుడు చావు రాదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో ధూంధాంగా డ్యాన్స్ చేస్తున్నాడు. మాంచి హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. అందరిని ఉర్రూతలూగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తున్న వేదిక మీదనే కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఆ వ్యక్తి చనిపోయాడంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. నా టైమ్ ఎప్పుడు వస్తుందో కానీ.. నాకు చావు వస్తే ఇలాగే రావాలనుకుంటా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

7426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles