గర్భిణికి పురిటినొప్పులు.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి ఆటో.. వీడియో

Wed,August 7, 2019 04:41 PM

ఓ ఆటో డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఓ మంచి పని చేశాడు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లీబిడ్డ ప్రాణాలను సురక్షితంగా కాపాడాడు. ఆగస్టు 4వ తేదీన ఉదయం ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. ఈ రైలులోని ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. కుండపోత వర్షాల కారణంగా ఆ రైలును విరార్ స్టేషన్‌లో నిలిపి ఉంచారు. ఈ సమయంలోనే గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.


తన భార్య బాధను చూసిన ఆ భర్త.. స్టేషన్‌లోని ఆటో స్టాండ్‌కెళ్లి.. అర్జంట్‌గా గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఓ ఆటో డ్రైవర్‌ను కోరాడు. ఆటో డ్రైవర్ ఏం ఆలోచించకుండా.. ఆటోను రైల్వే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చి గర్భిణిని ఎక్కించుకున్నాడు. స్టేషన్‌కు సమీపంలో ఉన్న సంజీవని ఆస్పత్రికి గర్భిణిని తీసుకెళ్లాడు. నెలలు నిండని శిశువుకు ఆమె జన్మనిచ్చింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి.. ఆటోను ప్లాట్‌ఫాంపైకి తీసుకురావడంతో.. ఆటో డ్రైవర్ సాగర్ కమలాకర్ గవాడ్(34)ను రైల్వే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై సాగర్ విడుదలయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ సాగర్ ఓ మంచిపని చేశాడని రైల్వే పోలీసులు ప్రశంసించారు.


2195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles