మోదీ బర్త్‌డే.. బంగారు కిరీటం సమర్పణ

Tue,September 17, 2019 09:27 AM

లక్నో : ప్రధాని నరేంద్ర మోదీని అమితంగా అభిమానించే ఓ వ్యక్తి.. ఆయన జన్మదినం సందర్భంగా.. హనుమాన్‌కు బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వారణాసి నియోజకవర్గానికి చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి.. మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని ఎన్నికల సమయంలో మొక్కుకున్నట్లు సింగ్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్‌డే సందర్భంగా ఆ బంగారు కిరీటాన్ని దేవునికి సమర్పించానని చెప్పారు. ఈ కిరీటం 1.25 కేజీల బరువున్నట్లు పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతుందన్నారు అర్వింద్ సింగ్. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.



1276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles