నిషేధ‌మా.. సుప్రీంకు వెళ్లిన మాయావ‌తి

Tue,April 16, 2019 11:08 AM

హైద‌రాబాద్‌: బీఎస్పీ నేత మాయావ‌తిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం 48 గంటల ప్ర‌చార నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. విద్వేష పూరిత ప్ర‌సంగాలు చేస్తున్న కొంద‌రు నేత‌ల‌పై సోమ‌వారం ఈసీ ఆంక్ష‌లు విధించింది. అయితే ఆ నిషేధాన్ని మాయావ‌తి సుప్రీంకోర్టులో ఇవాళ స‌వాల్ చేశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘించిన యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రి మేన‌కా గాంధీ, యూపీ నేత ఆజం ఖాన్‌ల‌పైన కూడా ఈసీ కొర‌ఢా ఝళిపించిన విష‌యం తెలిసిందే. యోగిపై 72 గంట‌ల నిషేధం విధించారు. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల నుంచి ఈసీ ఆదేశాలు అమ‌లులోకి వ‌చ్చాయి. లోక్‌సభ ఎన్నికలు అలీకి, భజరంగ్ బలీకి మధ్య జరుగుతున్నాయని యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని మాయావతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే మాయావ‌తి వేసిన అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించేందుకు సుప్రీం నిరాక‌రించింది. బ్యాన్‌పై స‌ప‌రేట్ పిటిష‌న్ వేయండి, ఇప్పుడు ఇది విచారించ‌లేం, దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం పేర్కొన్న‌ది. విద్వేష ప్ర‌సంగాలు చేస్తున్న నేత‌ల‌పై ఈసీ తీసుకున్న చ‌ర్య‌ల‌ను సుప్రీంకోర్టు ప‌రిశీలించింది. ఆ చ‌ర్య‌ల ప‌ట్ల కోర్టు సంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల సంఘం త‌న అధికారాన్ని తిరిగి సాధించుకున్న‌ద‌ని, మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను అవ‌స‌రం లేద‌ని కోర్టు చెప్పింది.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles