ఆంధ్రా సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణే..

Wed,April 3, 2019 03:27 PM

Mayawati predicts Pawan Kalyan as next Andhra CM

హైద‌రాబాద్‌: ఇవాళ వైజాగ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని మాయావ‌తి హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలో విఫ‌లమైన‌ట్లు ఆమె చెప్పారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి మాయా మీడియాతో మాట్లాడారు. సాయి ప్రియా రిసార్ట్స్‌లో ఈ స‌మావేశం జ‌రిగింది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ అన్యాయం చేసింద‌న్నారు. 2014లో బీజేపీ ఎన్నో వాగ్దానాలు చేసింద‌ని, కానీ ఒక్క వాగ్దానాన్ని కూడా అమ‌లుచేయ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా తాను ప్ర‌ధాని అవుతారో లేదో తెలుస్తుంద‌ని మాయావ‌తి అన్నారు. యూపీ సీఎంగా నాలుగుసార్లు చేశాన‌ని, ఒక‌వేళ త‌మకు అవ‌కాశం వ‌స్తే, అప్పుడు యూపీ మాడ‌ల్‌ను అమ‌లు చేస్తామ‌న్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అవుతార‌ని ఆమె అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

2439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles