రోడ్డుపై గన్స్ తో కొట్టుకుంటూ వీడియో షూట్

Wed,June 12, 2019 11:53 AM

Men brandish with guns at greater Noida highway


నోయిడా : ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పట్టపగలే కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యువకులు రెండు కార్లలో వెళ్తూ..కిటికీలో నుంచి బయటకు వచ్చి తుపాకులతో కొట్టుకున్నారు. మరో వ్యక్తి రెండు కార్లను ఫాలో అవుతూ ఈ దృశ్యాన్నంతా రికార్డు చేస్తున్నాడు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కారులో ఉన్న ఓ వ్యక్తి యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్‌ ఛానల్‌ కోసమే వారు ఈ వీడియో తీసినట్లుగా గుర్తించామని పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. తుపాకులతో రోడ్లపైకి వచ్చి..జనాలు తిరిగే ప్రాంతంలో ఒకరినొకరు బెదిరించుకుంటూ వీరంగం సృష్టించిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు కార్లలో ఉన్న వ్యక్తులు స్టంట్స్ చేస్తున్నట్లు తేలిందని కస్నా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో తెలిపారు. గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై ఈ ఘటన జరిగింది.

2067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles