పామును కాపాడిన బుడతలు.. వీడియో

Fri,June 7, 2019 11:15 AM

Minor children rescue non venomous snake trapped in fishnet

పామును చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ హడలిపోతారు.. అది విష రహితమా? విష సహిత సర్పమా? అనేది చూడకుండా దాన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ బుడతలు మాత్రం అది విష రహిత సర్పం అని గమనించి ఓ పామును కాపాడారు. ఒడిశా మయూరుభంజ్‌లోని ఓ గ్రామంలో చేపలు పట్టే వలలో పాము చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన ఇద్దరు బుడతలు.. వలలో చిక్కిన పామును నెమ్మదిగా బయటకు తీశారు. ఆ తర్వాత పామును అక్కడున్న చెట్ల పొదల్లో వదిలేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పామును కాపాడిన పిల్లలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

4488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles