మైనర్‌పై ఆర్మీ ఉద్యోగి అత్యాచారం

Thu,June 20, 2019 11:40 AM

కోల్‌కతా : అభం శుభం తెలియని ఓ మైనర్‌పై ఆర్మీ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 15న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మైనర్‌ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ గ్రూప్‌-డీ ఉద్యోగి.. ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్మీ ఉద్యోగి పరారీ అయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

3624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles