ట్విట్టర్‌లో మోదీ హవా..

Tue,September 10, 2019 04:24 PM

modi hawaii in twiwwer

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్‌లో ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఆయనను ట్విట్టర్‌లో 4.9 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న నేతల్లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన కంటే ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(10.8 కోట్ల మంది ఫాలోవర్స్), ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(6.4 కోట్ల మంది ఫాలోవర్స్) ఉన్నారు.

భారత ప్రధానుల్లో అత్యధిక ఆకర్షణ గల నేత గానూ మోదీ ఉన్నారు. ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు, ఆయన తీసుకునే సాహసోపేత నిర్ణయాలు, వ్యాక్చాతుర్యం, వస్త్రధారణ.. ఇలా ఆయన చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది.

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles