గురుదేశ్వర్‌ దత్‌ గుడిలో పూజలు నిర్వహించిన మోదీ

Tue,September 17, 2019 01:27 PM

గుజరాత్‌: ప్రధాని నరేంద్ర మోదీ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌లోని నర్మదా జిల్లా నందు గల గురుదేశ్వర్‌ దత్‌ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి ఆయన పేరున అర్చన చేసి, దీవించారు. కాగా, మోదీ 69 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నాడు. శారీరకంగా, మానసికంగా ఆయన చాలా దృఢంగా ఉంటారన్న విషయం తెలిసిందే. నిత్యం యోగాతో ఆయన దిన చర్య ప్రారంభమవుతుంది.


వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్న మోదీ దేశం కోసం చిరస్మరణీయ సేవలు చేశారు, చేస్తున్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ మరింత ఉత్సాహంగా తన విధులను నిర్వహిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనం కూడా కోరుకుందాం.


652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles