మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు: అమిత్ షా

Mon,September 23, 2019 10:57 AM

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలుపుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి హోస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోదీ’ బహిరంగ సభ గురించి అమిత్ షా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాను తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయన వివిధ దేశాలతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారనీ, అమెరికాతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుందని ఆయన అన్నారు. నిన్నటి వేదికే ఇందుకు నిదర్శనమనీ, ప్రపంచ వ్యాప్తంగా మోదీకి లభిస్తున్న ఆదరణను భారత ప్రజలకు దక్కుతున్న గౌరవంగా ఆయన అభివర్ణించారు. అమెరికా గడ్డపై బలమైన భారత్‌ను మోదీ ఆవిష్కరించారనీ, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో హౌడీ మోదీ కార్యక్రమం నిలిచిపోతుందనీ, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఈ ఘటన చెరగని ముద్ర వేస్తుందన్నారు.


రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల నేతలు తమ కలల్ని, ఆలోచనలను పంచుకున్నారనీ, ప్రపంచ సౌభాగ్యం కోసం ఇరు దేశాల నాయకులు కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ భద్రత, ఐక్యత కోసం మోదీ రాజీ లేని పోరాటం చేస్తున్నారనీ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘హౌడీ మోదీ’ కార్యక్రమం ఇరుదేశాల మైత్రిని ఇనుమడింపజేసిందనీ, దీనికి కారకులైన ప్రధాని మోదీకి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.








849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles