నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Sat,June 8, 2019 07:13 AM

Monsoon to hit Kerala coast

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు శనివారం (నేడు) కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అలాగే వచ్చే 48 గంటల్లో ఈశాన్య రాష్ర్టాల్లోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని పేర్కొంది. రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎండీ వరుసగా నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. 9న కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నారింజ హెచ్చరిక.. తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మత్య్సకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. నైరుతి అరేబియా సముద్రంపై గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles