కేరళ సీఎం విజయన్‌కు ఎంపీ రాహుల్‌గాంధీ లేఖ

Thu,November 21, 2019 08:01 PM


వయనాడ్‌: కేరళలో చిన్నారి మృతి ఘటనపై కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశారు. వయనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బతేరిలోని స్కూల్‌లో పాము కాటుతో మృతి చెందిన ఐదో తరగతి విద్యార్థిని ఎస్‌ శెహలా కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీఎం పినరయి విజయన్‌కు రాహుల్‌గాంధీ లేఖలో విజ్ఞప్తి చేశారు. చిన్నారి మృతి ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles