లోకేశ్ సమస్య కూడా ఇదే..!

Mon,July 22, 2019 12:21 PM

MP Vijay Sai Reddy Sensational Comments on Nara Lokesh

విజ‌య‌వాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసిందని వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందని వివ‌రించారు. సోమ‌వారం ఉద‌యం ట్విట‌ర్ వేదిక‌గా ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఏమ‌న్నారంటే.. 'తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు'. అని సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వలేమని, అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు జూలై 18న ప్రపంచ బ్యాంకు ప్రకటించిన విష‌యం తెలిసిందే.

1342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles