నాలుగేళ్లుగా యువతిపై వైద్యుడి అత్యాచారం

Mon,October 14, 2019 12:29 PM

ముంబయి : వైద్యం కోసం వెళ్లిన ఓ యువతిపై నాలుగేళ్లుగా డాక్టర్‌ అత్యాచారం చేస్తున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మేఘ్వాడి పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పైల్స్‌ వ్యాధి కారణంగా 27 ఏళ్ల యువతి డాక్టర్‌ వంశ్‌రాజ్‌ ద్వివేది(58) వద్దకు 2015లో వెళ్లింది. అయితే శస్త్ర చికిత్సలో భాగంగా ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత అత్యాచారం చేశాడు. దీన్ని తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. ఇక ఈ వీడియోను ఆసరా చేసుకున్న డాక్టర్‌ ద్వివేది యువతిని లొంగదీసుకున్నాడు. తన వద్దకు రాకపోతే ఆ వీడియోను వైరల్‌ చేస్తానని బెదిరించాడు.


దీంతో చేసేదేమీ లేక యువతి.. డాక్టర్‌ పిలిచినప్పుడల్లా వెళ్లేది. అయితే ఇటీవలే బాధిత యువతికి వివాహం అయింది. అప్పట్నుంచి డాక్టర్‌ ఫోన్‌కు సమాధానం ఇవ్వడం లేదు యువతి. దీంతో ఆ వీడియోలను ద్వివేది వైరల్‌ చేశాడు. వీడియో యువతి భర్తకు చేరడంతో ఆమెను నిలదీశాడు. జరిగిన విషయాన్ని తన భర్తకు యువతి చెప్పడంతో.. డాక్టర్‌ ద్వివేదిపై పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి.. ద్వివేదిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 17వ తేదీ వరకు డాక్టర్‌కు రిమాండ్‌ విధించారు.

9769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles