రామమందిరం నిర్మాణానికి 51 వేలు విరాళమిచ్చిన వసీం రిజ్మి

Fri,November 15, 2019 10:59 AM

లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రామమందిరం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్మి రూ. 51 వేలు విరాళం ఇచ్చారు. ఎన్నో దశాబ్దలుగా పెండింగ్‌లో ఉన్న వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తమమైన తీర్పును ఇచ్చిందని వసీం రిజ్మి పేర్కొన్నారు. అయోధ్యలోనే రామమందిరం నిర్మించాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మసీదుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. రామమందిరం నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు సహాయం చేస్తుందన్నారు వసీం రిజ్మి. రామ మందిరం నిర్మాణం ప్రపంచంలోని రామభక్తులకు గొప్ప గౌరవం అని ఆయన అభిప్రాయపడ్డారు.

1288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles