మోదీ సాయం కోరిన రాహుల్‌

Fri,August 9, 2019 12:49 PM

Narendra Modi assures Rahul Gandhi all help to deal with Kerala floods

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో భీక‌ర వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో అక్క‌డ కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. వ‌య‌నాడ్‌కు చెందిన ఎంపీ రాహుల్ గాంధీ వ‌ర‌ద‌ల విష‌యంలో మోదీ సాయం కోరారు. మోదీతో మాట్లాడిన రాహుల్‌.. కేర‌ళ దుస్థితి గురించి వివ‌రించారు. వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేసేందుకు ప్ర‌ధాని అంగీక‌రించిన‌ట్లు రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. కేర‌ళ సీఎంతోనూ రాహుల్ మాట్లాడారు. త‌న‌కు వెళ్లాల‌ని ఉంది, కానీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ఇబ్బందులు ఉంటాయ‌ని రాహుల్ చెప్పారు. త్వ‌ర‌లోనే వ‌య‌నాడ్ విజిట్ చేస్తాన‌న్నారు.

2869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles