బస్టాండ్ వద్ద బూట్లు తుడుస్తూ..

Fri,September 20, 2019 04:49 PM


కర్ణాటక: కర్ణాటకలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుండటంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ యూఐ)నేతలు రోడ్డెక్కారు. ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఎస్ యూఐ నేతలు శివమొగ్గలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూర్చొని బూట్లు పాలిష్ చేస్తూ..పండ్లు అమ్ముతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

1135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles