కశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణం: అమిత్ షా

Sun,September 22, 2019 08:46 PM

ముంబయి: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే కశ్మీర్ సమస్యకు ప్రధాన కారకుడని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా ముంబయిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం సిద్దించిన తరువాత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయకుండా నెహ్రూ క్షమించరాని తప్పు చేశారని ఆయన మండిపడ్డారు. పైగా జమ్మూ కశ్మీర్‌కు ఆర్టికల్ 370 కేటాయించి మరో తప్పిదం చేశారని, ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరిందన్నారు. కశ్మీర్ అంశాన్ని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు అప్పగించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన తెలిపారు. సర్దార్ సారథ్యంలో ఎన్నో సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయని ఆయన అన్నారు.


కశ్మీర్‌లో ఉగ్రమూకలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామనీ, ఇంతటి సున్నిత, దేశం గర్వించే అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. అలా చేయడం ఆ పార్టీ అపరివక్వతకు నిదర్శనమని ఆయన అన్నారు. రాహుల్‌కు రాజకీయంగా ఎలాంటి పరిపక్వత లేదనీ, అందుకే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష భాద్యతల నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ ప్రధాన ఎజెండా దేశాన్ని ఐక్యంగా ఉంచడమేనన్నారు. ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

1016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles