ఆటోరిక్షా ఎమోజీ.. నెటిజన్ల రియాక్షన్ సూపర్..!

Fri,February 8, 2019 08:10 PM

Netizens reaction on New Auto Rickshaw Emoji

వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్నా అనే నానుడి వినే ఉంటారు కదా. కానీ.. అది పాతబడిపోయింది. ఇది టెక్నాలజీ యుగం కదా.. అందుకే.. ఇప్పుడు వెయ్యి కామెంట్ల కన్నా ఒక్క ఎమోజీ మిన్నా అని అనాలి. అవును.. ఒక్క ఎమోజీ చాలు.. సరైన భావాన్ని ప్రతిబింబించడానికి.

అందుకే.. ఇప్పుడు నవ్వొస్తే.. నవ్వుతున్నాం అని చెప్పడం కాదు.. నవ్వుతున్న ఓ ఎమోజీని పడేస్తే చాలు.. ఓహో.. ఇతడు నవ్వుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇలా.. రకరకాల భావోద్వేగాలకు ఎన్నో రకాల ఎమోజీలు ఉన్నాయి. వీటన్నింటినీ ఆమోదించడానికి యూనికోడ్ కన్సార్టియమ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అదే కొత్త కొత్తగా వచ్చే ఎమోజీలను ఆమోదిస్తుంది. అదే రిలీజ్ కూడా చేస్తుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా 230 ఎమోజీలను ఆ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందట. వాటిలో ఆటోరిక్షా ఎమోజీ కూడా ఒకటి.

అయితే.. ఆటో అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి. ఆటో.. అంటూ పిలవడం.. ఆటోవాలా.. ఆటో వస్తావా? అని అడిగితే.. ఆటోవాలా రానని చెప్పడం. ఏ ఆటో నయి జాయెగా, నయి జానేకా హే.. అనడం, ఇలా ప్రతి ఒక్కరి మైండ్‌లో ఆటో మీద ఇటువంటివే తిరుగుతాయని నెటిజన్లు నిరూపించారు. ఆ ఎమోజీపై ఇటువంటి కామెంట్లే పెట్టి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 2019లో రిలీజయిన ఎమోజీల్లో ట్రెండింగ్‌లో ఉన్న మరికొన్ని ఎమోజీల్లో టెంపుల్, శారీ ఉన్నాయి.
4459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles