మండపంలోని పెళ్లిని వదిలేసి.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షించిన అతిథులు.. వైరల్ వీడియో

Fri,May 17, 2019 04:03 PM

Newlyweds sidelined at their own wedding as guests watch IPL final video goes viral

సాధారణంగా పెళ్లికి అతిథులు ఎందుకు వస్తారు. వధూవరులను ఆశీర్వదించాలనే కదా. పెద్దలు వధూవరులను ఆశీర్వదించి.. పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి.. అతిథ్యం స్వీకరించి వెళ్తారు. అది ఆచారం. కానీ.. ఇటీవలే జరిగిన ఓ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులు మాత్రం మండపంలో జరుగుతున్న పెళ్లిని గాలికి వదిలేసి.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశారు. అసలు.. తాము పెళ్లి వేడుకకు వచ్చామన్న విషయాన్ని కూడా మరిచిపోయినట్టున్నారు. మండపం పక్కన పెద్ద స్క్రీన్‌లో మ్యాచ్ వస్తుంటే.. ఆసక్తిగా అంతా తిలకిస్తుండటంతో బిత్తరపోవడం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వంతయింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చివరి రెండు ఓవర్లు ఎంత టఫ్‌గా జరిగాయో అందరికీ తెలిసిందే. చివరి బంతి వరకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని అంతా అనుకున్నారు కానీ.. చివరి బాల్‌లో అంతా రివర్స్ అయి.. ముంబై ఇండియన్స్ కప్పును ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత ఆ మ్యాచ్‌పై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. కోట్లకు కోట్లు ఒకే క్షణంలో చేతులు మారాయి. దోనీ ఔట్‌పై దుమారం లేచింది.

పెళ్లికి వచ్చిన అతిథులు.. మ్యాచ్‌ను తిలకిస్తూ.. ముంబై ఇండియన్స్ గెలవగానే.. బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆ వీడియోపై తెగ కామెంట్లు చేస్తున్నారు.
6546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles