నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యాను ఒకే జైలు గ‌దిలో బంధిస్తారా !

Sat,March 30, 2019 10:18 AM


హైద‌రాబాద్ : భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీకి బెయిల్ ఇచ్చేందుకు లండ‌న్ కోర్టు నిరాక‌రించింది. ఏప్రిల్ 26వ తేదీ వ‌ర‌కు అత‌న్ని క‌స్ట‌డీలో ఉంచాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే విచార‌ణ స‌మ‌యంలో ఆ కోర్టు జ‌డ్జి ఎమ్మా ఆర్బుత్‌నాట్ ఓ జోకేశారు. ఒక‌వేళ నీర‌వ్ మోదీని భార‌త్‌కు అప్ప‌గిస్తే, విజ‌య్ మాల్యాను వేసే జైలు గ‌దిలోనే నీర‌వ్‌ను బంధిస్తారా అని ఆమె ప్రాసిక్యూట‌ర్‌ను అడిగారు. దీంతో కోర్టులో న‌వ్వులు పూశాయి. విజ‌య్ మాల్యా కూడా బ్యాంకులకు వేల కోట్లు ఎగ‌వేసి లండ‌న్‌లో త‌ల‌దాచుకుంటున్నాడు. అత‌న్ని కూడా అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌ను భార‌త్ కోరింది. అయితే ఆ కేసునూ జ‌డ్జి ఎమ్మా ఆర్బుత్‌నాట్ విచారించారు. నీర‌వ్ మోదీ కేసును విచారిస్తున్న స‌మ‌యంలో.. త‌న‌కు మాల్యా కేసు జ్ఞ‌ప‌కాలే గుర్తుకు వ‌స్తున్నాయ‌ని ఆమె అన్నారు. నీర‌వ్ కేసును విచారిస్తూ వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్ అయిన జ‌డ్జి ఎమ్మా.. నీరవ్‌ను భార‌త్‌లో ఏ కోర్టుకు త‌ర‌లిస్తార‌ని ప్రాసిక్యూట‌ర్‌ను ప్ర‌శ్నించారు. అయితే ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్డులో ఉన్న జైలుకే పంపించినున్న‌ట్లు న్యాయ‌వాది చెప్పారు. ఆ స‌మ‌యంలో జ‌డ్జి న‌వ్వులు పూయించారు. మాల్యాను వేసే జైలు వీడియోను గ‌తంలో పంపించార‌ని, ఆ జైలు గ‌దిలో ఖాళీ స్థ‌లం చాలానే ఉంద‌ని, ఆ గ‌దిలోనే నీర‌వ్‌ను కూడా బంధిస్తారా అని జ‌డ్జి న‌వ్వుతూ కామెంట్ చేశారు.

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles