వారణాసిలో ఇందూరు రైతులు.. సోమవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు

Sat,April 27, 2019 09:27 PM

- ఇంటలిజెన్స్ వర్గాలు అడ్డుకునే యత్నం
- తమిళనాడు రైతుల అరెస్టు
- ఆటంకాలన్నీ చేధించి సోమవారం నామినేషన్ వేస్తామన్న రైతులు


నిజామాబాద్: పసుపునకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇందూరు రైతులు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ అక్కడి కలెక్టరేట్‌కు వెళ్లిన యాభై మంది ఇందూరు రైతులు నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. నామినేషన్లు వేసేందుకు మద్దతుదారుల సహాయాన్ని కూడగట్టారు.

అయితే ఇంటలిజెన్స్ వర్గాలు నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు సృష్టించే పనికి పూనుకున్నారు. ఇందూరు రైతుల నామినేషన్లకు ప్రపొజర్స్‌గా ఉన్న వారిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ చెందిన రైతులు నామినేషన్ వేసేందుకు వారణాసి బయలుదేరి వస్తున్నారని తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కొన్ని కారణాలను సాకుగా చూపుతూ వారిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు బెయిల్ పై బయటకు వచ్చిన వారు నామినేషన్ వేసేందుకు వస్తున్నారు.

పసుపు బోర్డు, పసుపునకు మద్దతు ధర కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన తమను.. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటిని తుత్తునియలు చేసి సోమవారం నామినేషన్ వేస్తామని తెలిపారు. ఇందూరు నుంచి యాభై మంది రైతులు, తమిళనాడు నుంచి ఇరవై మంది రైతుల వరకు నామినేషన్లు వేస్తామని తెలిపారు.

2369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles