బెంగాల్‌ వివాదంపై ఈసీ సీరియస్‌.. రేపటితో ప్రచారానికి తెర

Wed,May 15, 2019 08:05 PM

No election campaigning to be held in 9 parliamentary constituencies of West Bengal

పశ్చిమబెంగాల్‌: కోల్‌కతాలో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో రేపటితో ప్రచారం ముగించాలని ఆదేశాలు జారిచేసింది. రేపు రాత్రి 10 గంటల వరకు ప్రచార ముగింపు సమయంగా ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఏడవ దశ పోలింగ్‌ నిర్వహణ జరగనున్న విషయం తెలిసిందే. బిహార్‌-8, జార్ఖండ్‌-3, మధ్యప్రదేశ్‌-8, పంజాబ్‌-13, ఛత్తీస్‌గడ్‌-1, ఉత్తరప్రదేశ్‌-13, హిమాచల్‌ ప్రదేశ్‌-4, పశ్చిమబెంగాల్‌-9 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్‌లో డుం డుం, బరసత్‌, బసిర్హత్‌, జైనగర్‌, మధురాపూర్‌, జాదవ్‌ఫూర్‌, డైమండ్‌ హార్బర్‌, సౌత్‌ కోల్‌కతా, నార్త్‌ కోల్‌కతా తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహణ. కాగా బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. చివరిదశ పోలింగ్‌కు ఎల్లుండితో ప్రచార గడువు ముగియనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది.

1902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles