పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవం.. స్వీట్లు పంచుకోలేదు..

Wed,August 14, 2019 02:36 PM

NO EXCHANGE OF SWEETS BETWEEN BSF AND PAK RANGERS ON PAK INDEPENDENCE DAY

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అట్టారి - వాఘా సరిహద్దు వద్ద బక్రీద్‌ నాటి పరిస్థితులే పునరావృతం అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి పాక్‌ తెరదించింది. మొన్న జరిగిన బక్రీద్‌ పర్వదినం రోజున బీఎస్‌ఎఫ్‌ దళాలు, పాక్‌ రేంజర్లు స్వీట్లు పంచుకోలేదు. ఇవాళ కూడా దాయాది దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ఇరు దేశాలు స్వీట్లు పంచుకోలేదు. పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు బీఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రయత్నించాయి. కానీ పాక్‌ నుంచి స్పందన లేదు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌తో పాక్‌ అన్ని సంబంధాలను తెంచేసుకున్న విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్‌ తెంచేసుకున్న విషయం విదితమే. ఇక వినోద రంగానికి చెందిన అన్ని రకాల సాంస్కృతిక మార్పిడిలు, కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు పాక్‌ నిర్ణయించింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలు, థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలతో పాటు లాహోర్‌ - ఢిల్లీ ఫ్రెండ్‌షిఫ్‌ బస్సు సర్వీసులను పాక్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

2915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles