కేంద్రమంత్రి స్మృతిఇరానీని కలిసిన కైలాశ్ సత్యార్థి

Wed,July 17, 2019 06:20 PM

Nobel Laureate Kailash Satyarthi meets smriti Irani


న్యూఢిల్లీ: నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి ఇవాళ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిఇరానీని కలిశారు. స్మృతిఇరానీతో బాలల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కైలాశ్ సత్యార్థి చర్చించారు. తనను నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి కలిశారని, ఆయనతో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించానని..కైలాశ్ సత్యార్థి రాసిన పుస్తకాన్ని తనకు అందజేశారని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

చైల్డ్ ఫోర్నోగ్రఫీ నిషేధించే దిశగా తీసుకున్న చర్యలపై స్మృతి ఇరానీకి కైలాశ్ సత్యార్థి ప్రశంసలందించారు. ఆన్‌లైన్ ద్వారా చిన్నారులపై జరగుతున్న లైంగికవేధింపులను అరికట్టేందుకు ఏడాది కాలంగా తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసకు చరమగీతం పాడేందుకు ఇటీవలే కేంద్రప్రభుత్వం పోక్సో చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ తీసుకువచ్చిన సంస్కరణలను కైలాశ్ సత్యార్థి స్వాగతించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే మరణశిక్షను విధించేలా పోక్సో యాక్ట్‌లో చేసిన సవరణకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles