టాయిలెట్లు శుభ్రం చేయడానికి నేను పార్లమెంట్‌కు ఎన్నిక కాలేదు..

Mon,July 22, 2019 11:46 AM

Not Elected To Clean Toilets says Pragya Thakur On BJP Workers Complaint

హైదరాబాద్‌ : భోపాల్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వర్షాలు పడడంతో తన పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో అక్కడ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ప్రగ్యాకు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. నాయకుల విజ్ఞప్తిపై ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టాయిలెట్లు, మురికి కాలువలు శుభ్రం చేయడానికి తాను పార్లమెంట్‌కు ఎంపిక కాలేదు. మీరు అర్థం చేసుకోవాలి. తాను కేవలం స్థానిక ఎమ్మెల్యేలకు, మున్సిపల్‌ అధికారులకు, కార్మికులకు మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాను. వారితో పని చేయించుకోవాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. ప్రగ్యా సమాధానంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రసంగాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే ప్రగ్యా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకుడు తారీక్‌ అన్వర్‌ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం. ఆమెపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

1609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles