మైనర్‌కు బైకు ఇచ్చాడు..రూ.26 వేలు జరిమానా

Tue,January 14, 2020 05:32 PM


భువనేశ్వర్‌: మైనర్‌కు నడిపేందుకు బైకు ఇచ్చిన యజమానికి రూ.26 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్‌ పోలీసులు. అంగుల్‌ జిల్లాలో పలాలా హడ పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..ఓ బాలుడు హెల్మెట్‌, లైసెన్స్‌ లేకుండా బైకును నడిపిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా బైకు నడుపుతున్న సదరు బాలుడికి బైకు ఇచ్చిన అనిల్‌ కుమార్‌ జెనాకు పోలీసులు మోటారు వెహికిల్‌ చట్టం-2019 ప్రకారం సెక్షన్‌ 194డీ, 199ఏ కింద రూ.26 వేలు జరిమానా విధించారు.

764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles