ఓలా లైసెన్సు ఆర్నెళ్లు ర‌ద్దు

Fri,March 22, 2019 06:32 PM

Olas licence in Bengaluru suspended for six months

హైద‌రాబాద్‌: అక్ర‌మంగా బైక్‌లు న‌డుపున్న ఓలా కంపెనీపై క‌ర్నాట‌క ర‌వాణాశాఖ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ట్యాక్సీ ఆప‌రేట‌ర్ ఓలా లైసెన్సును ఆర్నెళ్ల పాటు ర‌ద్దు చేశారు. బెంగుళూరులో వెంట‌నే బైక్ స‌ర్వీసుల‌ను నిలిపివేయాల‌ని ఆ రాష్ట్ర‌ ర‌వాణా శాఖ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఈనెల 18వ తేదీన ఆర్డ‌ర్‌ను జారీ చేశారు. అయితే ఆర్డ‌ర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును స‌రెండ‌ర్ చేయాల‌ని కూడా ఓలా కంపెనీని ఆదేశించారు. రూల్స్‌ను అతిక్ర‌మిస్తున్నందునే ఓలా లైసెన్సును ఆర్నెళ్ల పాటు ర‌ద్దు చేసిన‌ట్లు ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్ వీపీ ఇక్కేరి తెలిపారు.

2240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles