దొంగలను తరిమికొట్టిన వృద్ధ దంపతులు..వీడియో

Mon,August 12, 2019 07:59 PM

ఇంట్లో చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలకు తగిన బుద్ది చెప్పారు వృద్ధదంపతులు. తమిళనాడులోని తిరునళ్వేలిలో ఓ ముసలాయన తన ఇంటి వరండాలో కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఇద్దరు దుండగులు మాస్క్ లు వేసుకుని కత్తులతో అక్కడికి వచ్చారు. ఓ దొంగ ముసలాయన మెడకు టవల్ చుట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఇంట్లో నుంచి ఆ ముసలాయన భార్య పరుగెత్తుకొచ్చి దొంగవైపు కుర్చీ విసిరింది. దొంగలిద్దరూ కత్తులతో బెదిరించే ప్రయత్నం చేసినా వృద్ధ దంపతులు ఏ మాత్రం బెదరకుండా కుర్చీలతో దాడి చేసి వారిని పరుగులు పెట్టించారు. చోరీకి వచ్చిన దొంగలకు చుక్కలు చూపించి తరిమికొట్టిన వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా దొంగలను అడ్డుకున్న దంపతులకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

4175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles