స్వయం సహాయ బృందాల్లో ఒకరికి రూ. లక్ష వరకు రుణం

Fri,July 5, 2019 01:34 PM

న్యూఢిల్లీ : దేశంలోని స్వయం సహాయ బృందాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీపి కబరు వినిపించారు. స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తిస్తుందని ఆమె లోక్‌సభలో ప్రకటించారు. ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ. లక్ష వరకు ముద్ర రుణం ఇస్తామని ఆమె పేర్కొన్నారు. జన్‌ధన్‌ ఖాతా ఉన్న మహిళలకు రూ. 5 వేల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ప్రత్యేక పాత్ర అని ఆమె చెప్పారు. మహిళల ప్రోత్సాహకంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెలుగులు వస్తున్నాయన్నారు. మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు ప్రవేశపెడుతామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.



6338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles